FbTelugu

రష్యా వ్యాక్సిన్ కోసం భారత్ అభ్యర్థన

ఆర్డీఐఎఫ్ సీఈఓ తో భారత రాయబారి చర్చలు

మాస్కో: రష్యా తయారు చేస్తున్న వ్యాక్సిన్ స్పుత్నిక్-వి పై భారత్ ఆసక్తి కనబరుస్తున్నది. రష్యాలోని భారత రాయబారి వెంకటేష్ వర్మ, రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సీఈఓ కిరిల్ దిత్రియేవ్ తో చర్చలు కూడా జరిపారు.

వ్యాక్సిన్ ఉత్పత్తి విషయంలో పరస్పర సహకారం చేసుకోవాలని చర్చించినట్లు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ అంశంపై చర్చలు సానుకూల వాతావరణంలో ఫలప్రదంగా జరిగాయని, త్వరలోనే అనుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వెంకటేష్ వర్మ తెలిపారు.

భారత్ కు చెందిన కొన్ని కంపెనీలు స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఫేజ్ 1, ఫేజ్ 2 క్లినికల్ ప్రయోగాలపై వివరాలు కోరాయి. వ్యాక్సిన్ దేశీయ ఉత్పత్తి, ఎగుమతికి గల అవకాశాలపై ఆసక్తి చూపించాయి.

You might also like