FbTelugu

బంగ్లా మత్స్యకారుల్ని రక్షించిన భారత నేవీ

ఢాకా : చేపల వేటకు వెళ్లిన బంగ్లాదేశ్ మత్స్యకారుల పడవ ప్రమావద శాత్తూ మునిగిపోగా.. మత్స్యకారులను ఇండియన్ కోస్ట్ గార్డు సిబ్బంది రక్షించింది. వివరాల్లోకెళితే.. బంగ్లాదేశ్ కు చెందిన 19 మంది మత్స్యకారులు సముద్రంలో రాణా పడవలో చేపల వేటకు వెళ్లారు.

ఈ క్రమంలో పారాదీప్, ఒడిశా సమీపంలో పడవ బోల్తా పడింది. దీంతో సముద్రంలో మునిగిపోతున్న మత్స్యకారులను భారత కోస్ట్ గార్డులు కాపాడారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు. వారిని సురక్షితంగా వారి దేశానికి పంపిస్తున్నట్టు కోస్ట్ గార్డులు ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.