FbTelugu

గోదాముల లూటీకి సమయమొచ్చింది: తికాయత్

న్యూఢిల్లీ: మూడు నెలలు దాటినా నల్ల వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం ఉలుకు పలుకు లేకపోవడంతో ఉద్యమం చేస్తున్న రైతులు ఆగ్రహంతో ఉడికిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.సి.ఐ) గోదాములను రైతులు లూటీ చేసేందుకు సమయం ఆసన్నమైందని రాకేశ్ ట్వీట్ చేశారు. ఆ వెంటనే తన ట్వీట్ ను తొలగించారు. ప్రైవేటు గోదాములలో ఆహార ధాన్యాలను నిల్వ చేస్తే ప్రజలు ఆకలితో మరణిస్తారని ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు రైతుల ఆందోళన కొనసాగుతుందని, ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొంటామన్నారు. కరోనా పేరుతో కేంద్ర ప్రభుత్వం రైతులు భయపెట్టడం మానుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు. కరోనా పేరు చెప్పి కర్ఫ్యూ విధించినా, లాక్ డౌన్ లు అమలు చేసినా రైతు ఉద్యమం కొనసాగి తీరుతుందని రాకేష్ తికాయత్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.