న్యూఢిల్లీ: ఇండియన్ గ్లోబల్ వీక్-2020 లో ఇవాళ భారత ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా 30 దేశాల ప్రతినిధులతో మోదీ చర్చజరిపారు. ఈ వర్చువల్ కాన్ఫరెన్స్ లో 5 వేల మంది పాల్గొన్నారు. ఈ సమావేశాలు మూడు రోజుల పాటూ కొనసాగనున్నాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ లోపెట్టుబడులు పెట్టాలంటూ పిలుపునిచ్చారు. అన్ని రంగాలపై కరోనా ప్రభావం పడిందని మోదీ అన్నారు. అయితే కరోనా సంక్షోభం నుంచి ప్రపంచం కోలుకుంటోందని అన్నారు.