FbTelugu

బస్తా యూరియా ను అర లీటర్ సీసాగా మార్చారు

అమరావతి: అనేక రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్న విధంగా రైతులు విరివిగా ఉపయోగించే యూరియాలో మార్పులు వచ్చాయి. సంప్రదాయ యూరియా కన్నా మరిం శక్తివంతంగా పనిచేసే నానో యూరియా త్వరలోనే మార్కెట్ లోకి రాబోతున్నది.
యూరియా అంటే 45 కిలోల బస్తాలో లభ్యమయ్యేది. తెల్లటి గుళికల రూపంలో ఉన్న ఈ బస్తా రవాణా కూడా భారంగా మారింది. భారత రైతులు ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) ఎరువుల తయారీలో విన్నూత్న ఆవిష్కరణలు చేసింది.

ప్రపంచంలోనే తొలిసారిగా యూరియా ను నానో టెక్నాలజీ మిళితం చేసి తయారు చేసింది. సంప్రదాయక గుళికల స్థానంలో ద్రావణం రూపంలో ఉండే యూరియాను తయారు చేశారు. 45 కిలోల యూరియాను 500 మిల్లీ లీటర్లు (అర్థ లీటర్) సీసాలో పట్టే విధంగా తయారు చేసి రైతుల కష్టాలు తీర్చారు. బస్తా యూరియాలో ఉండే పోషకాలు ఈ చిన్న సీసాలోకి మార్చి విజయవంతం అయ్యారు. ఈ సీసాలో 40వేల పిపిఎం నైట్రోజన్ ఉండనుంది. భవిష్యత్తు ఎరువుల మార్కెట్ లో ఇది ఒక సంచలనం కాబోతున్నది. ప్రస్తుతం ఒక బస్తా యూరియా ధర రూ.268 కాగా నానో యూరియా బాటిల్ ధర రూ.240 మాత్రమే. అది కాకుండా పంటల దిగుబడిని 8 శాతం పెంచుతుందని ఇఫ్కో ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.