FbTelugu

ఇండియా వరల్డ్ రికార్డ్…

న్యూఢిల్లీ: క్రీడలు, ప్రతిభలో ప్రపంచ రికార్డు నెలకొల్పలేనప్పటికీ రోజువారి కరోనా పాజిటివ్ కేసుల్లో ఇండియా వరల్డ్ రికార్డు సృష్టించింది. దేశంలో వరుసగా మూడో రోజు మూడు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

గడచిన 24 గంటల్లో 17,40,550 మందికి పరీక్షలు నిర్వహించగా కొత్తగా 3,32,320 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2256 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 1.86 లక్షల మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 1,62,63,695 కాగా ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారు 1,36,41,406 మంది. భారత్ లో ఇప్పటిదాకా 13 కోట్ల వ్యాక్సినేషన్ ఇచ్చారు. దేశ జనాభాలో 10శాతం కూడా వ్యాక్సినేషన్ ఇవ్వలేకపోయింది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం.

You might also like

Leave A Reply

Your email address will not be published.