FbTelugu

బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం

టీమిండియా భారత్ గడ్డపై మరోసారి తన సత్తా చాటింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో నేడు ముగిసిన చారిత్రక డే/నైట్ టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 30.3 ఓవర్లలోనే 106 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా భారత్ 89.4 ఓవర్లలో 347 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ 41.1 ఓవర్లలో 195 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఘన విజయం సాధించింది.

You might also like