FbTelugu

రెమిడెసివిర్ దిగుమతి: కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా విలయతాండవం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరతపై చర్యలు తీసుకోక తప్పలేదు. విదేశీ సాయం తీసుకోమని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా మళ్లీ అడుగులు వేసింది.

ఐసియులో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ రోగులకు రెమిడెసివిర్ ఇంజక్షన్ కీలకంగా మారింది. దీంతో వ్యాపారులు బ్లాక్ మర్కెట్ కు తరలించి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. రూ.3వేల విలువ చేసే దీన్ని రూ.30వేలు మొదలు రూ.70వేల వరకు సందర్భాన్ని బట్టి విక్రయిస్తున్నారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి. ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ స్పందించింది.

ఈ డ్రగ్ ను విదేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. 4.5 లక్షల డోసులను దిగుమతి చేసుకునేందుకు సుంకాలను కూడా రద్దు చేసింది. తొలి విడతగా ఇవాళ 75వేల డోసులు దేశానికి చేరుకోనున్నాయి. హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్, గిలియడ్ సైన్సెస్, ఇవా ఫార్మా కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.