FbTelugu

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థకు భార‌త్ షాక్‌

క‌రోనావైర‌స్ ప్ర‌భావం మొద‌లైన‌ప్ప‌ట్నుంచి ప్ర‌పంచ దేశాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ (డబ్ల్యూహెచ్ఓ). ఇప్పుడు భార‌త్ ఆగ్ర‌హానికి గురవుతోంది. అమెరికా స‌హా ఎన్నో దేశాలు హైడ్రాక్సీ క్లోరోక్విన్ స‌ల్ఫేట్ టాబ్లెట్ల‌ను వినియోగించ‌డం శ్రేయ‌స్క‌ర‌మ‌ని చెబుతుంటే, అందుకు భిన్నంగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వ్య‌వ‌హ‌రిస్తోంది.

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో జ‌రిపే క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిలిపివేయాల‌ని చెప్ప‌డంపై భార‌త్ స‌సేమిరా చెప్పేసింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడ‌టం ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంద‌ని తెగేసి చెప్పింది. ఇన్ని రోజులు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు భార‌త్ బాస‌ట‌గా నిలిచినా, హైడ్రాక్సీ క్లోరోక్విన్ విష‌యంలో మాత్రం పొర‌పొచ్చాలు వెలుగు చూశాయి. ఈ విష‌యంలో ఏకంగా భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) డైర‌క్ట‌ర్ భార్గ‌వ స‌మావేశం ఏర్పాటు చేసి మ‌రి క‌రాఖండీగా చెప్పారు.

మ‌లేరియా ప్ర‌భావిత ప్రాంతాల్లో క‌రోనా వైర‌స్ తీవ్ర‌త త‌క్కువ‌గా ఉంద‌ని ప్ర‌పంచంలో అధ్య‌య‌నాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. బి.సి.జి వ్యాక్సిన్ వేయించుకున్న దేశాల్లోనూ తీవ్ర‌త త‌క్కువ‌గా ఉంద‌ని చెబుతున్నాయి. వీటి విష‌యంలో నిజం ఎంత‌వ‌ర‌కు ఉంద‌నేది ప‌క్క‌న పెడితే మ‌లేరియా ప్ర‌భావిత ప్రాంతాల్లో క‌రోనా వైర‌స్ తీవ్ర‌త త‌క్కువ‌గా ఉండ‌టం వెనుక ప్ర‌ధానంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడ‌టం ముఖ్య కార‌ణ‌మ‌ని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. ఈ మందులో యాంటి వైర‌ల్ ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో క‌రోనా వైర‌స్ ను స‌మ‌ర్థంగా ఎదుర్కొంటోంద‌ని క‌నుగొన్నారు. ఈ విష‌యంపై వివిధ దేశాల అధ్య‌య‌నాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. స్వ‌యంగా అగ్ర‌రాజ్యం అమెరికా సైతం భారీగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ దిగుమ‌తి చేసుకుంది. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తానూ హైడ్రాక్సీ క్లోరోక్విన్ వేసుకుంటున్నాన‌ని చెప్పారు.

ఒకప‌క్క ప్ర‌పంచ‌దేశాలు హైడ్రాక్సీ క్లోరోక్విన్ అవ‌స‌రాన్ని గుర్తించి క‌రోనా నియ‌త్రణ‌కు దివ్యౌష‌ధ‌మ‌ని భావిస్తుండ‌గా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఇదేమీ ప‌ట్ట‌ద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ముందు నుంచీ చైనాతో దోస్తీ చేస్తూ ఆ దేశం ఏం చెబితే అదే వేదం అన్న‌ట్లుగా వ‌ల్లెవేస్తోంది. ఇప్పుడు హైడ్రాక్సీ క్లోరోక్విన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిలిపివేయాల‌ని ఆదేశించింది. కానీ విష‌యంపై భార‌త్ పూర్తిగా విభేదించింది. ఈ నిర్ణయాన్ని వ్య‌తిరేకిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేరుగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాసింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిలిపివేయాల‌ని చెప్ప‌డం స‌మంజసం కాద‌ని స్ప‌ష్టం చేసింది. వారం రోజుల కింద‌టే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఎగ్జ‌క్యుటివ్ బోర్డు ఛైర్‌ప‌ర్స‌న్‌గా కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్థ‌న్ ఎంపికయ్యారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌లో ప‌ట్టు సాధించే దిశ‌గా క‌స‌ర‌త్తు చేస్తున్న భార‌త్ త‌న స్వ‌రం పెంచుతూ హైడ్రాక్సీ క్లోరోక్విన్ విష‌యంలో త‌న నిర్ణయాన్ని స్ప‌ష్టం చేసింది.

You might also like