FbTelugu

ఇండియాలో 24,248 కేసులు నమోదు

ఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రతరం అవుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 24,248 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,97,413కి చేరుకున్నది.

ప్రస్తుతం ఆక్టివ్‌ కేసులు 2,53,287 ఉండగా, 4,24,433 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. నిన్నటి వరకు మొత్తం 99,69,662 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. ఒకటి రెండు రోజుల్లో కోటి పరీక్షలకు చేరువ కానున్నారు. గత 24 గంటల్లో 425 మంది చనిపోగా, ఇప్పటి వరకు కరోనా బారిన పడి 19,693 మంది మృతి చెందారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.