FbTelugu

చైనాను అధిగమించిన భారత్

భారత్ లో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. కరోనా కేసుల్లో ఏకంగా చైనానే అధిగమించేసింది. ఇప్పటివరకు భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 85,940 కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 3,970 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

కాగా గడిచిన 24 గంటల్లోనే కరోనాతో 103 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 30,152 కు చేరింది. మొత్తం కరోనా మృతుల సంఖ్య 2,752 గా ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 53,035. వీరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

You might also like