FbTelugu

ట్విట్టర్ కు భారత్ నోటీసులు

ఢిల్లీ: చైనా యాప్ లపై ఇప్పటికే ఉక్కుపాదం మోపిన భారత ప్రభుత్వం ట్విట్టర్ పై దృష్టి సారించింది. తాజాగా దేశాధినేతలు, ప్రముఖ వాణిజ్య వేత్తలు, టెక్ కంపెనీల అధినేతల ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ అయిన విషయం తెలిసిందే.

ఊహించని పరిణామంతో పలువురు ప్రముఖులు కలవరానికి గురయ్యారు. ఒక్కసారిగా టెక్ ప్రపంచం ఉలిక్కి పడింది. అయితే ఈ సైబర్ దాడిపై భారత ప్రభుత్వం ట్విట్టర్ సంస్థ వివరణ కోరింది. హ్యాకింగ్ కు సంబంధించిన వివరాలు అందచేయాలంటూ కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ నోటీసులు జారీ చేసింది.

ఈ హ్యాకింగ్ తో భారతీయ ఖాతాదారులు ఎంత మంది ప్రభావితం అయ్యారు, ఇందులో ప్రముఖులు ఎంత మంది ఉన్నారో చెప్పాలని సూచించింది. అదే విధంగా సమాచార భద్రత కోసం ఏ విధానాలు అనుసరిస్తున్నారు, ఆ వివరాలు నిర్ణీత గడువులోపు సమర్పించాలని కోరింది. హ్యాకర్లు చెప్పిన లింకులకు ఎంత మంది భారతీయులు బిట్ కాయిన్లు పంపించారు, వారి వివరాలు అందచేయాలని నోటీసులో స్పష్టం చేసింది.

You might also like