FbTelugu

కరోనా కేసుల్లో 3వ స్థానంలో భారత్

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నమోదౌతున్న కరోనా కేసుల్లో భారత్ మూడవ స్థానంలో ఉంది. గడిచిన 24 గంటల్లోనే దేశంలో కొత్తగా 19,459 కరోనా కేసులు నమోదైనాయి.

ఇదే సమయంలో 380 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,48,318 కి చేరింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 16,475 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. కరోనా బారిన పడి ఇప్పటివరకు 3,21,723 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 2,10,120కి చేరింది.

You might also like