FbTelugu

భారత్ కొత్త కేసులు 1.52లక్షలు

హైదరాబాద్: దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతున్నది. ప్రతి రోజు గత రోజుతో పోల్చితే ఎక్కువగానే కేసులు నమోదు అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,52,879 కరోనా పాజిటివ్ కేసులు కాగా 839 మంది మరణించారు.
దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,33,58,805. మొత్తం కరోనా మరణించిన వారి సంఖ్య 1,69,275 గా ఉంది. మహారాష్ట్రంలో శనివారం నాడు ఒక్కరోజే 60వేల పాజిటివ్ కేసుల మార్క్ దాటింది. కేసుల నియంత్రించేందుకు ఏం చేయాలనేదానిపై మహారాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.
తెలంగాణలో 3187 కేసులు
తెలంగాణలో గడచిన 24 గంటల్లో కొత్తగా 3187 కరోనా కేసులు నమోదు అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఏడుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,27,278 కాగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 1759.

You might also like

Leave A Reply

Your email address will not be published.