FbTelugu

పాక్ తీరుపై మండిపడిన భారత్

India-fires-on-the-Pakistani

భారత్ విషయంలో సందుదొరికితే ఎలా దూరిపోవాలా అని చూసే పాకిస్థాన్ తీరుపై భారత్ మండిపడింది. తాజాగా అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పాక్ కామెంట్లు చేయడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ సందర్భంగా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొన్నారు. భారత అంతర్గత వ్యవహారంలో పాక్ జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. విద్వేషపూరితంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించింది.

You might also like