FbTelugu

డ్రాగన్ తో భార‌త్ తాడోపేడో

ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా మహమ్మారి ఓ కుదుపు కుదిపేస్తోంది. ఇంతటి విపత్కర పరిస్థితులకు కారణమైన కరోనా చైనాలోనే పట్టిందన్న విషయం కూడా తెలిసిందే. కాగా ఈ క‌రోనావైర‌స్ పుట్ట‌క విష‌యంలో ఇప్పటివరకూ.. కేవలం అమెరికా, బ్రిట‌న్ మాత్ర‌మే చైనాపై విరుచుకుపడుతున్నాయి. తాజాగా భార‌త్ చైనాపై ఈ విషయంలో తాడోపేడో తేల్చుకోవడానికి స్వ‌రం పెంచేందుకు సిద్ధ‌మైంది.
మొదటినుంచే అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏకంగా క‌రోనావైర‌స్‌కు చైనా వైర‌స్ అని పేరు పెట్టేశాడు.  భార‌త్ తొలిసారిగా పెద‌వి విప్పింది. నాలుగు రోజుల కింద‌ట కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ సైతం క‌రోనావైర‌స్ ప్ర‌యోగ‌శాల‌లే పుట్టింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇన్ని రోజులు ప్ర‌జ‌ల్లో ఉన్న అనుమానాలకు ఆయ‌న వ్యాఖ్య‌లు బ‌లం చేకూర్చాయి.

ఇప్పుడు క‌రోనా విష‌యంలో స్వ‌తంత్ర ద‌ర్యాప్తు సంస్థ‌తో ప‌రిశోధ‌న చేయించాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వార్షిక స‌ద‌స్సులో 62 దేశాలు డిమాండ్ చేశాయి. దీనికి భార‌త్ కూడా మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించి చైనానే దోషిగా నిల‌బెట్టింది.

క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో నిష్ప‌క్ష‌పాతంగా, వ్య‌క్తిగ‌తంగా, స‌మ‌గ్రంగా, ప్ర‌స్తుతం ఉన్న విధానాల‌కు అనుకూలంగా క‌రోనా మ‌హ‌మ్మారి అంశంలో డ‌బ్ల్యూహెచ్‌వో పాత్ర‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని ముసాయిదాలో పేర్కొన్నారు.  డ‌బ్ల్యూహెచ్‌వోపై ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేప‌ట్టాల‌ని గ‌త నెల‌లో తొలుత ఆస్ట్రేలియా డిమాండ్ చేసింది.

క‌రోనావైర‌స్ గ‌తేడాది నవంబ‌రులో తొలిసారిగా వూహాన్‌లో ప్ర‌బ‌లింది. అక్క‌డి వైర‌స్ ల్యాబ్ నుంచే వైర‌స్ వ్యాప్తి జ‌రిగింద‌ని ప్ర‌పంచ‌మంతా అనుమానిస్తోంది. ఈ విష‌యంలో చైనాలోని కొంద‌రు ర‌చ‌యిత‌లు, వైరాల‌జీ నిపుణులు కూడా ప్ర‌యోగ‌శాల నుంచే వైర‌స్ పుట్టింద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

కానీ దీన్ని చైనా ముందు నుంచి తోసిపుచ్చుతోంది. ప్ర‌యోగ‌శాల నుంచి వైర‌స్ వ్యాప్తి జ‌ర‌గ‌లేద‌ని త‌ప్పును క‌ప్పిపుచ్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఈ విష‌యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా చైనాను వెనుకేసుకుని వ‌చ్చింది. దీనిపై అగ్ర‌రాజ్యం అమెరికా మండిప‌డి ఏటా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు ఇచ్చే నిధులను నిలిపివేస్తున్నట్లు ప్ర‌క‌టించింది.

ఇప్పుడు ఏకంగా 62 దేశాలు ఒక్క‌తాటిపైకి వ‌చ్చి క‌రోనా పుట్టు పూర్వోత్త‌రాలు తేల్చాల‌ని డిమాండ్ చేయ‌డంతో చైనా ఇరుకున ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు. ఈ విష‌యంలో అమెరికా వైఖ‌రి చెప్ప‌క‌పోయినా క‌చ్చితంగా మ‌ద్ధ‌తు ఉంటుంద‌ని అన్ని దేశాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా క‌రోనావైర‌స్‌కు మూలం ఎక్క‌డ‌? మ‌నిషిలోకి ఎలా వ‌చ్చింది? జ‌ంతువుల నుంచి వ‌చ్చిందా లేదా? అన్నఅంశాల‌ను ద‌ర్యాప్తులో తే్ల్చాల‌ని భార‌త్ స‌హా 62 దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వార్షిక స‌ద‌స్సులో పెట్టిన ప్ర‌తిపాద‌న ఒకే అయితే మాత్రం క‌రోనా విష‌యంలో చైనా విచార‌ణ‌ను ఎదుర్కొక త‌ప్ప‌దు.

You might also like

Leave A Reply

Your email address will not be published.