FbTelugu

బ్యాటింగ్ తో బరిలోకి దిగిన భారత్

  సిడ్నీ: నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టీ 20 మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్ తో బరిలోకి దిగింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ను ఎంచుకుంది. ఈ మ్యాచ్ కాన్ బెర్రాలోని మనూకా ఓవల్ లో జరుగుతోంది.

ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో మనీష్ పాండే, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్, నటరాజన్ లకు స్థానం కల్పించారు. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో అత్యంత పేలవ ప్రదర్శనతో వన్డే సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో టీ20 సిరీస్ నైనా చేజిక్కించుకోవాలని కోహ్లీ సేన పట్టుదలగా ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.