FbTelugu

చైనా యాప్ లను నిషేధించలేదు: కేంద్రం

ఢిల్లీ: చైనా యాప్ లను నిషేధించలేదని, వాటి పనితీరును నియంత్రించాలని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది.

చైనా అప్లికేషన్లను నిషేధించినట్లు, నియంత్రించేందుకు భారత ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఖండించింది. గూగుల్, యాపిల్ కంపెనీలకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ప్రచారంలోకి వచ్చిన ఉత్తర్వుల్లో వాస్తవం లేదని పీఐబీ స్పష్టం చేసింది.

సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలను నమ్మవద్దని, పోస్టు పూర్తిగా అసత్యమని పేర్కొంది. లాద్దాఖ్ గాల్వన్ లోయలో చైనా దేశం భారత ఆర్మీ సిబ్బందిని పొట్టనబెట్టుకోవడంతో చైనా వస్తువులను నిషేధించాలనే డిమాండ్ ఊపందుకున్న విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.