FbTelugu

ఇండియా కోలుకోవడం కష్టం: ట్రంప్

వాషింగ్టన్: ఇండియా ఇప్పట్లో కోలుకోవడం కష్టమని, కరోనా సెకండ్ వేవ్ తో సర్వనాశనమైందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

సెకండ్ వేవ్ లో వైద్య సదుపాయాలు కరువై తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదన్నారు. అంతర్జాతీయ ఛానల్ ఫాక్స్ న్యూస్ కు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వైరస్ తో ఇండియాలో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. కరోనాతో ఆ దేశం పూర్తిగా నాశనమైందని, ఒక్క ఇండియానే కాదు చాలా దేశాల్లో ఈ దుస్థితి ఉందన్నారు. అందుకే నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాను… వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అనేది ఇప్పటికైనా తేలాలన్నారు. చైనా ప్రభుత్వం సహకారం అందించాలని, అక్కడి నుంచే వైరస్ పుట్టుకువచ్చినట్లు ఆధారాలు లభ్యమవుతున్నాయని ట్రంప్ అన్నారు.

చైనా ఇది కావాలని చేసినా, ప్రమాద వశాత్తు చేసినా జరగాల్సిన నష్టం జరిగిందన్నారు. చైనా దేశం నిర్లక్ష్యం మూలంగానే ప్రపంచం విలవిల్లాడుతున్నదన్నారు. చైనా మూలంగా పలు దేశాలు కోలుకోని విధంగా నష్టపోయాయి. అనేక దేశాలు కకావికలమయ్యాయి. ఆ దేశాలు మునుపుటిలా ఉండకపోవచ్చు. పూర్వ స్థితికి రావడానికి ఎన్నేళ్లు పడుతుందనేది చెప్పడం కష్టమని ట్రంప్ వ్యాఖ్యానించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.