FbTelugu

పాక్‌కు దిమ్మతిరిగేలా భారత్ కౌంటర్

భారత్ విషయంలో సందుదొరికితే దూరిపోవాలని చూసే పాకిస్థాన్ కు భారత్ గట్టి కౌంటరే ఇచ్చింది. తాజాగా ప్యారిస్‌లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంతస్కృతిక సంస్థ(యునెస్కో) సదస్సులో పాకిస్థాన్ సంబంధం లేకుండా కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తింది. దీంతో భారత్‌ పాక్‌పై తీవ్రంగానే స్పందించింది. అసలు ఉగ్రవాదం పాకిస్థానీయుల డీఎన్‌ఏలోనే ఉందంటూ భారత ప్రతినిధి అనన్య అగర్వాల్‌ అన్నారు. యునెస్కో వేదికలో భారత అంతరంగిక వ్యవహారాన్ని బహిర్గతం చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. పాక్‌ అనుసరిస్తున్న సంకుచిత దోరణులే ఆ దేశాన్ని దిగాజారుస్తున్నాయని అన్నారు.

You might also like