FbTelugu

ఇండియా కరోనా అప్ డేట్స్…

ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. గడచిన 24గంటల్లో అత్యధికంగా 18,522 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

దీంతో మంగళవారం ఉదయానికి దేశంలో కొవిడ్‌-19 బారినపడ్డ వారిసంఖ్య 5,66,840 కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా సోకి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 16,893. కరోనా సోకిన వారిలో ఇప్పటివరకు 3,34,822 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. మరో 2,15,125 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం వెల్లడించింది..

You might also like

Leave A Reply

Your email address will not be published.