FbTelugu

ఇండియా కేసులు@72330

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 72,330 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 459 మంది మృతి చెందారు.

సెకండ్ వేవ్ కారణంగా గత మూడు వారాలుగా క్రమంగా కేసుల సంఖ్య ఎగబాకుతున్నది. దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 1,22,21,665 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 5,84,055 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్ లో చికిత్స కొనసాగుతున్నది. కరోనా నుండి ఇప్పటి వరకు కోలుకున్నవారు 1,14,74,683 మంది బాధితులు ఉన్నారు. దేశంలో కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 1,62,927 మంది మృతి. నిన్న ఒక్కరోజే 40,382 మంది బాధితులు కోలుకోగా, దేశవ్యాప్తంగా రికవరీ రేటు 93.89%, మరణాల రేటు 1.33% ఉంది. మహారాష్ట్రలో నిన్న 39వేల 544 పాజిటివ్ కేసులు రాగా, 227 మంది చనిపోయారు. దేశంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర గుర్తింపు పొందింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.