FbTelugu

ఇండియా కేసులు 11,18,043

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. పాజిటివ్ కేసుల సంఖ్య 11 లక్షలు దాటింది.
దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 11,18,043 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడచిన మూడు రోజుల వ్యవధిలో ఒక లక్షకు పైగా పాజిటివ్ కేసుల నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 40,425 పాజిటివ్ కేసులు నమోదు కాగా 681 మంది మృతి చెందారు.

మొత్తం 11,18,043 కేసుల్లో 3,90,459 మందికి చికిత్స కొనసాగుతుండగా, ఇప్పటి వరకు 7,00, 087 మంది కోలుకున్నారు.
నిన్న ఒక్కరోజే 22, 664 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు వెళ్లారు. వైరస్ సోకి ఇప్పటివరకు 27,497 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేసులు అధికంగా పెరుగుతుండడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్లు చేసి మాట్లాడారు. రాష్ట్రంలో స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

You might also like