FbTelugu

59 చైనా యాప్స్ పై కేంద్రం నిషేధం

ఢిల్లీ: ఇండియాలో చైనా యాప్స్ ను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. మొత్తం 59 చైనా యాప్స్ ను నిషేధించింది. దేశ భద్రత, రక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఇందులో ప్రధానంగా టిక్ టాక్, వీ ఛాట్, షేర్ ఇట్, హాలో, యూసీ బ్రౌజర్, బైదు, ఎంఐ కమ్యూనిటీ, ఎంఐ వీడియో కాల్, వీగో వీడియో యాప్స్ ఉన్నాయి.

ఇటీవల ఇండియా-చైనా సరిహద్దుల్లో చైనా ఆర్మీ అనవసరంగా సరిహద్దు వివాదం రాజేసి ఇరవై ఇండియా సైనికులను హతమార్చిన విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అప్పటి నుంచే చైనా యాప్స్ పై కేంద్రం నిఘా పెంచడంతో, నిషేధానికి చర్యలు ప్రారంభించింది. లాభ, నష్టాలు బేరీ వేసి చివరకు వీటిని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నది.

కేంద్రం నిషేధించిన 59 యాప్స్ ఇవే..
1. టిక్ టాక్(TikTok)
2. షేర్ఇట్(Shareit)
3. క్వాయ్(Kwai)
4. యూసీ బ్రౌజర్(UC Browser)
5. బైదు మ్యాప్(Baidu map)
6. షెయిన్(Shein)
7. క్లాష్ ఆఫ్ కింగ్స్(Clash of Kings)
8. డీయూ బ్యాటరీ సేవర్(DU battery saver)
9.హెలో(Helo)
10.లైకీ(Likee)
11. యూక్యామ్ మేకప్(YouCam makeup)
12. ఎంఐ కమ్యూనిటీ(Mi Community)
13. సీఎం బ్రౌజర్స్(CM Browers)
14. వైరస్ క్లీనర్(Virus Cleaner)
15. ఆపస్ బ్రౌజర్(APUS Browser)
16. రోవీ(ROMWE)
17. క్లబ్ ఫ్యాక్టరీ(Club Factory)
18. న్యూస్ డాగ్(Newsdog)
19. బ్యూట్రీ ప్లస్(Beutry Plus)
20. వుయ్ చాట్(WeChat)
21. యూసీ న్యూస్(UC News)
22. క్యూక్యూ మెయిల్(QQ Mail)
23. వీబో(Weibo)
24. గ్జెండర్(Xender)
25. క్యూక్యూ మ్యూజిక్(QQ Music)
26. క్యూక్యూ న్యూస్ ఫీడ్(QQ Newsfeed)
27. బిగో లైవ్(Bigo Live)
28. సెల్ఫీ సిటీ(SelfieCity)
29. మెయిల్ మాస్టర్(Mail Master)
30. ప్యారలల్ స్పేస్(Parallel Space)
31. ఎంఐ వీడియో కాల్-షియోమీ(Mi Video Call — Xiaomi)
32. వుయ్ సింక్(WeSync)
33. ఈఎస్ ఫైల్ ఎక్స్ ప్లోరర్(ES File Explorer)
34. వివా వీడియో – క్యూయూ వీడియో ఐఎన్ సీ(Viva Video — QU Video Inc)
35. మెయిటు(Meitu)
36. విగో వీడియో(Vigo Video)
37. న్యూ వీడియో స్టేటస్(New Video Status)
39. డీయూ రికార్డర్(DU Recorder)
39. వాల్ట్-హైడ్(వాల్ట్-హైడ్)
40. క్యాచీ క్లీనర్ డీయూ యాప్ స్టూడియో(Cache Cleaner DU App studio)
41. డీయూ క్లీనర్(DU Cleaner)
42. డీయూ బ్రౌజర్(డీయూ బ్రౌజర్)
43. హాగో ప్లే విత్ న్యూ ఫ్రెండ్స్(Hago Play With New Friends)
44. క్యామ్ స్కానర్(Cam Scanner)
45. క్లీన్ మాస్టర్ – చీతా మొబైల్(Clean Master – Cheetah Mobile)
46. వండర్ కెమెరా(Wonder Camera)
47. ఫొటో వండర్(Photo Wonder)
48. క్యూక్యూ ప్లేయర్(QQ Player)
49. వుయ్ మీట్(We Meet)
50. స్వీట్ సెల్ఫీ(Sweet Selfie)
51. బైదు ట్రాన్స్ లేట్(Baidu Translate)
52. వీమేట్(Vmate)
53. క్యూక్యూ ఇంటర్నేషనల్(QQ International)
54. క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్( QQ Security Center)
55. క్యూక్యూ లాంచర్(QQ Launcher)
56. యూవీడియో(U Video)
57. వీ ఫ్లై స్టేటస్ వీడియో(V fly Status Video)
58. మొబైల్ లెజెండ్స్(Mobile Legends)
59. డీయూ ప్రైవసీ(DU Privacy)

 

You might also like