FbTelugu

నిలకడగా రానిస్తున్న టీమిండియా

సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న 3వ టెస్టులో భారతజట్టు నిలకడగా ఆడుతూ స్కోరును పెంచుతోంది. ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌ను 312 పరుగుల వద్ద డిక్లేర్ చేసి భారత్ కు 407 పరుగుల భారీ లక్ష్యాన్ని మిగిల్చింది.

ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఓవర్‌నైట్ స్కోరుకు నాలుగు పరుగులు మాత్రమే జోడించి మరో వికెట్ చేజార్చుకుంది. భారీ లక్ష్యం దిశగా భారత్ పయనిస్తోంది. ప్రస్తుతం భారత్ 4 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. కాగా భారత్ విజయానికి ఇంకా 143 పరుగులు చేయాల్సి ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.