FbTelugu

‘సరిహద్దు’పై నేడు భారత్, చైనా కీలక చర్చలు

న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దు వివాదంపై నేడు మరోసారి ఇరుదేశాలు కీలక చర్చలు జరుపనున్నాయి. సరిహద్దులో తాజా పరిణామాలు, ఉద్రిక్తతలపై ముఖ్యంగా చర్చించనున్నారు. ఓ పక్క కరోనాతో యావత్ ప్రపంచం విలవిలలాడుతుంటే..

చైనా మాత్రం భారత సరిహద్దును దాటుతూ.. దురాక్రమణలకు పాల్పడుతోంది. దీనిని తీవ్రంగా పరిగణించిన భారత్ సరైన గుణపాఠం చెప్పేందుకే ఎదురు చూస్తోంది. ఈ విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ.. వెనక్కి తగ్గేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పేసింది. ఈ నేపథ్యంలో తాజా చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

You might also like