FbTelugu

ఇండియా@1 లక్ష కేసులు

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ లో కేసులు ఊహించని విధంగా పెరుగుతునే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,03,558 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కరోనాతో చికిత్స పొందిన 52,847 మంది డిశ్చార్జీ అయి ఇళ్లకు వెళ్లగా, 478 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1.25 కోట్ల మంది కరోనా బారిన పడగా, 1.16 కోట్ల మంది చికిత్స పొందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7.41 లక్షలు ఉండగా, ఇప్పటి వరకు 1.65 లక్షల మంది చనిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.