FbTelugu

ప్రధాన పార్టీలకు ‘‘ఇండిపెండెంట్’’ ముచ్చెమటలు

చెన్నై: ప్రధాన రాజకీయ పార్టీలకు ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి పక్కలో బల్లెంలా తయారయ్యాడు. తమిళనాడు ఎన్నికల్లో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి సంచలన హామీలు ఇస్తున్నాడు.

దక్షిణ మధురై నుంచి ఇండిపెండెంట్ శరవణన్ గా బరిలోకి దిగాడు. ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. శరవణన్ హామీలు చూసి రాజకీయ నేతలు విస్తుపోతున్నారు. నియోజకవర్గ ప్రజల్ని చంద్రమండలం పైకి బ్యాచ్ ల వారీగా తరలిస్తానని, రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేస్తానని, ఇళ్లల్లో ఆడవాళ్లు పనికి సాయంగా ఇంటింటికీ ఒక రోబో పంపిణీ చేయనున్నట్లు ప్రకటించాడు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి కాల్వలు తవ్వించి ఇంటికో బోటు పంపిణీ, ఎండ వేడి నుంచి నియోజకవర్గాన్ని కాపాడేందుకు300 అడుగుల ఎత్తున కృత్రిమ మంచు కొండ నిర్మాణం చేస్తానని చెబుతున్నాడు. ప్రజలు ఎంజాయ్ చేయడానికి కృత్రిమ సముద్రం నిర్మాణం చేయించి, ప్రజలందరికీ ఐఫోన్ ఇప్పిస్తానని గుప్పిస్తున్న హామీలను చూసి ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.