FbTelugu

స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచానికే ఆదర్శం: కెసిఆర్

హైదరాబాద్: మనదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని మహాత్మా గాంధీ కి ముందు, తర్వాత అనే విశ్లేషణ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. గాంధీ ని స్ఫూర్తిగా తీసుకునే తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసినట్లు ఆయన తెలిపారు.
నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో ఇవాళ “ఆజాధి ఖా అమృత్ మహోత్సవ వేడుకల”ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ఈ సందర్బంగా కెసిఆర్ మాట్లాడుతూ గాంధీ రాక ముందు కూడా అనేక రూపాల్లో ఉద్యమం జరిగిందని, ఆయన ప్రవేశించిన తర్వాతనే స్వాతంత్ర ఉద్యమం ప్రజా బాహుళ్యం లోకి వెళ్లి, ఉద్తృతమైందని తెలిపారు. అహింస, శాంతియుత పద్దతిలో చేసిన స్వాతంత్ర పోరాటo ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. గాంధీ ఎంచుకున్న శాంతియుత పోరాట విధానం కొంతమందికి నచ్చలేదని, కానీ శాంతియుత పోరాటం వల్లనే దేశానికి స్వాతంత్రం లభించిందన్నారు. బ్రిటిష్ పాలకులు విధించిన “ఉప్పు పన్ను” పై వ్యతిరేకత నెలకొన్నప్పటికి గాంధీజీ చేపట్టిన “ఉప్పు సత్యాగ్రహం” స్వాతంత్ర్య ఉద్యమానికి మైలు రాయిగా నిలిచిందని కెసిఆర్ అన్నారు.
దండి యాత్రలో మన హైదరాబాద్ ముద్దుబిడ్డ సరోజినీ నాయుడు, లక్షలాది మంది పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో ఎందరో మహనీయులు తమ ఆస్తులు, ప్రాణాలు కోల్పోయారు. స్వాతంత్ర్య ఉద్యమ ఘట్టాలను, వాటి ప్రాధాన్యతను నేటి తరం విద్యార్డులు, యువతకు అవగాహన కల్పించేందుకు 2022 ఆగస్టు 15 వరకు పాఠశాలలు, కళాశాలలో వ్యాస రచన, వక్తృత్వ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా కెసిఆర్ మూడు రంగుల బెలూన్ లను ఎగురవేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.