FbTelugu

పెరుగుతున్న ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ విద్యార్థుల ఆత్మత్యలు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ఏపీలో మొత్తం ముగ్గురు ఇంటర్ విద్యార్థులు ఫెయిల్ అయ్యామన్న మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో ఓ విద్యార్థి బావిలో దూకి ఆత్మహత్య చేసుకోగా.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జూలకల్లులో పురుగుల మందు తాగి మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కడప రాజంపేటలో పావని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

You might also like