FbTelugu

పెరుగుతున్న కరోనా కేసులు

న్యూఢిల్లీ: గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 44,059 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 511 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 91,39,866 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో ప్రస్తుతం 4,43,486 మందికి పలు ఆసుపత్రులలో చికిత్స కొనసాగుతున్నది.

వైరస్ బారిన నుండి ఇప్పటి వరకు కోలుకున్నవారు 85,62,642 మంది కాగా ఇప్పటివరకు 1,33,738 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 41,024 మంది బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 93.68%, మరణాల రేటు 1.46% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.