FbTelugu

డ్రంకన్ డ్రైవ్ తో పెరుగుతున్న కరోనా కేసులు

హైదరాబాద్: పోలీసు ఉన్నతాధికారులు తమ వసూళ్ల లక్ష్యం నెరవేర్చుకునేందుకు కరోనా మహమ్మారి సమయంలో డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఫలితంగా పోలీసు కానిస్టేబుళ్లతో పాటు వాహనచోదకులు కరోనా బారిన పడుతున్నారు.

అయినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు మాత్రం డ్రంకన్ డ్రైవ్ కొనసాగించాల్సిందేనంటూ స్పష్టం చేయడంతో పోలీసులకు ప్రాణగండంగా మారింది. డ్రంక్ అండ్ డ్రైవ్ వలన పోలిస్ శాఖ లో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. వీకెండ్ వచ్చింది అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడానికి పోలీసులు జంకుతున్నారు. ప్రతి  పోలీసు స్టేషన్ లో  కనీసం ఇద్దరి నుంచి అర డజన్ వరకు  కరోనా సోకడంతో ఇతర సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం డ్రంకన్ డ్రైవ్ లపై నిర్ణయం తీసుకోవాలని కింది స్థాయి పోలీసు సిబ్బంది అభ్యర్ధిస్తున్నారు.

ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోలీసులు ఒకరికి ఉపయోగించిన బ్రీత్ అనలైజర్ ను మరొకరికి ఉపయోగించడం మూలంగా కరోనా కేసుల వ్యాప్తి వేగంగా పెరుగుతున్నది. ఈ విషయాన్ని వాహనదారులు చెబుతున్నా పోలీసుల చెవికి ఎక్కడం లేదు. కనీసం విన్పించుకోవడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. కరోనా కారణంగా ఇళ్ల నుంచి రావద్దని చెబుతున్న ప్రభుత్వం డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తుంటే ఏం చేస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.