FbTelugu

పెరుగుతున్న కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 23,285 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం ప్రకటన విడుదల చేసింది.

దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,08,846కు చేరుకోగా గడచిన 24 గంటల్లో 15,157 మంది కోలుకోగా 117 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,306కు పెరిగింది. ఇప్పటివరకు 1,09,53,303 మంది కోలుకోగా 1,97,237 మంది ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా 2,61,64,920 మందికి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్లు వేశారు. మహరాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్ర కేసుల నమోదు లో టాప్ లో ఉన్నది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.