FbTelugu

లాక్ డౌన్ ఉన్నా పెరుగుతున్న కేసులు

ఢిల్లీ: గత వారం రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.  దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 4,213 పాజిటివ్ కేసులు నమోదు కాగా 97 మంది చనిపోయారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ సంఖ్య  67,152కి చేరగా 2206 మంది మృతి చెందారు.

ఇప్పటివరకు 20,917 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 44,029 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి.

అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 22171కి చేరింది. వైరస్‌ కారణంగా 832 మంది మరణించారు. గుజరాత్‌లో మొత్తం 8194 కరోనా కేసులు నమోదవగా, 493 మంది మృతిచెందారు. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 7200కు చెరింది. దేశ రాజధాని ఢిల్లీలో 6923 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 3614 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 214 మంది చనిపోయారు.

You might also like