FbTelugu

మండలి లో పెరిగిన వైసిపి బలం

అమరావతి: శాసన మండలిలో టిడిపి సభ్యుల పదవీకాలం ముగియడంతో వైసిపి సభ్యుల బలం పెరగనున్నది. నేడు ఎనిమిది మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తున్నది.

స్థానిక సంస్థల కోటా కింద ఖాళీల సంఖ్య 11కు చేరనున్నది. కరోనా మహమ్మారి కారణంగా ఏపి తో పాటు తెలంగాణలో స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసి) వాయిదా వేసింది. కేసులు తగ్గుముఖం పట్టిన తరువాత ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించడంతో స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. ఏపిలో పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేయడంతో స్థానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ ఆలస్యం కానున్నాయి. ఇవాళ పదవీకాలం ముగియనున్న వారిలో టిడిపి నుంచి ఏడుగురు, వైసిపి నుంచి ఒక్క సభ్యుడు ఉన్నారు. టిడిపి నుంచి రెడ్డి సుబ్రమణ్యం, వైవిబి.రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, పప్పల చలపతి రావు, గాలి సరస్వతి, ద్వారపు రెడ్డి జగదీశ్వరరావు, బుద్దా నాగ జగదీశ్వర రావు లు ఉన్నారు. వైసిపి నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవీకాలం కూడా ఇవాళే ముగిసింది. సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి బలం పెరగడంతో మండలి రద్దు చేస్తారా కొనసాగిస్తారా మున్ముందు తెలియనున్నది. రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి గతేడాది తీర్మానం చేసి పంపించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.