FbTelugu

వాహనదారుల గుండెల్లో పెట్రోగుబులు

* వరుసగా 20వ రోజూ పెరిగిన పెట్రోల్ ధర

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విరామం లేకుండా వరుస పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. ఇవాళ దేశంలో లీటరు పెట్రోల్ పై 21 పైసలు, లీటరు డీజిల్ పై 17 పైసలు పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర కంటే డీజిల్ ధరే ఎక్కువగా ఉంది. నేడు ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.80.13 గా ఉండగా, లీటరు డీజిల్ ధర రూ.80.19 గా ఉంది. హైదరాబాద్ లో లీటర పెట్రోల్ ధర రూ.83 ఉండగా.. లీటరు డీజిల్ ధర రూ.80 గా ఉంది.

You might also like