న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకి క్రమంగా పెరుగుతూ కొండెక్కుతున్నాయి. సామాన్య వినియోగదారులపై పెట్రోధరలు గుదిబండలా మారాయి.
తాజాగా వరుసగా గత 11 రోజుల నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. లీటరు పెట్రోల్ పై 55 పైసలు, లీటరు డీజిల్ పై 69 పైసలు పెరిగింది. గడిచిన 11 రోజుల్లోనే పెట్రోల్ పై రూ.6.02, డీజిల్ పై రూ.6.49 పెరిగింది.