ఢిల్లీ: సామాన్య, మధ్య తరగతి ప్రజలపై ఇంధన భారం తప్పడం లేదు. కరోనా సమయంలో ధరలను స్థరీకరించే బదులు కేంద్రం పెంచుకుంటునే వెళ్తున్నది.
కరోనా పాజటివ్ తో ప్రజలు అల్లాడుతుండగా కేంద్ర ప్రభుత్వం 16వ రోజు కూడా ధరలు పెంపుదల చేసింది. పెట్రోల్ ధర లీటరుకు 33 పైసలు పెరుగగా, డీజిల్ పై 58 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 79.56 కి చేరగా, లీటర్ డీజిల్ ధర 78.85 చేరుకుంది.