FbTelugu

పెరిగిన డెంగ్యూ రోగుల సంఖ్య.. ఆరుబయటే వైద్యం

increased-number-of-dengue-patients-then-treatment-giving-out-side-

హైదరాబాద్: రాష్ట్రంలో డెంగ్యూ విజృంభిస్తోంది… దీంతో ఆస్పత్రులు సైతం సరిపోవడం లేదు. వికారాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు క్రైస్తవ మిషనరీ ఆసుపత్రిలో డెంగ్యూ రోగుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఆస్పత్రి యాజమాన్యం చేసేదేంలేక స్థలం సరిపోక చెట్ల కింద, ఆరుబయట గొడుగులను ఏర్పాటుచేసి రోగులకు చికిత్స చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాసుపత్రిలో సరైన చికిత్స చేసి ప్రజల ఆరోగ్యం విషయంలో తగు చర్యలు తీసుకోవాలని మిషన్ డాక్టర్ అవినాష్ తెలిపారు. రోగుల సంఖ్య పెరగడంతో తమ దగ్గరికి వస్తున్నారని.. కాబట్టి ఏదో విధంగా తమ ప్రయత్నంగా చికిత్స చేస్తున్నాంమని తెలిపారు.

You might also like