మహబూబ్ నగర్: ఎగువన గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు వరద క్రమంగా పెరుగుతోంది. వరద ఇన్ ఫ్లో 1,709 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,489 క్యూసెక్కులు ఉంది.
జూరాల ప్రజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 7.817టీఎంసీలు గా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 318.518 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 317.590 మీటర్లుగా ఉంది.