FbTelugu

నిండుకుండలా సుంకేశుల, సింగూరుకు పెరిగిన వరద

కర్నూలు: ఎగువన కురుస్తున్న వర్షాలకు సుంకేశుల రిజర్వాయర్ పూర్తిగా నిండి నిండుకుండను తలపిస్తోంది. సుంకేశుల పూర్తి స్తాయి నీటి నిల్వ సామర్థ్యం 1.20 టీఎంసీ(థౌజెండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్)లు కాగా ప్రస్తుత నీటి నిల్వ 1.19 టీఎంసీలు గా ఉంది.

దీంతో అధికారులు కేసీ కెనాల్ కు నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ సంగారెడ్డి జిల్లాలోని సింగూరు డ్యామ్ కు వరద క్రమంగా పెరుగుతోంది. ఇన్ ఫ్లో 63 వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 65 వేల క్యూసెక్కులు ఉంది.

You might also like