FbTelugu

సింగరేణి కార్మికుల పదవీ విరమణ పెంపు

హైదరాబాద్: సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26 తేదీన జరిగే బోర్డు మీటింగ్ లో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండి ఎన్.శ్రీధర్ ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు సిఎం పదవీ విరమణ వయస్సుపెంపు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43,899 మంది సింగరేణి కార్మికులు, అధికారులకు లబ్ధి చేకూరనున్నది. రామగుండం నియోజకవర్గ కేంద్రం లో సింగరేణి మెడికల్ కాలేజీ ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.