FbTelugu

ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల వ్యయం పెంపు

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్ ఎంపీ అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని సవరించింది. 25 రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలకు రూ.77 లక్షలు, అసెంబ్లీ స్థానాలకు రూ.30.80 లక్షలు వ్యయంగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అరుణాచల్ప్రదేశ్, గోవా, సిక్కింలతో పాటు 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్సభ స్థానాలకు రూ. 59.40లక్షలు, అసెంబ్లీ స్థానాలకు రూ.22 లక్షలు ఎన్నికల వ్యయంగా నిర్ణయించింది.

అలాగే దేశ రాజధాని ఢిల్లీలో లోక్సభ ఎన్నికలకు రూ.77 లక్షలు, అసెంబ్లీ ఎన్నికలకు రూ.30.80 లక్షలుగా ఖరారు చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ తో సంప్రదించి ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961ను సవరించినట్లు కేంద్రం పేర్కొంది.

ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం లోక్సభకు రూ. 70 లక్షలు, రూ. 54 లక్షలు, అసెంబ్లీ ఎన్నికలకు రూ.28 లక్షలు రూ.20 లక్షల మేరకు ఖర్చు చేయడానికి అనుమతి ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.