FbTelugu

నలుగురు చిన్నారులు సహా.. ఏడుగురు సజీవదహనం

బోపాల్: మధ్యప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు సహా ఏడుగురు సజీవదహనమయ్యారు. వివరాల్లోకెళితే.. ఇవాళ గ్వాలియర్‌ పట్టణంలో ఓ పెయింట్‌ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీంతో మంటలు పెయింటింగ్ కెమికల్స్ కి అంటుకొని ఒక్కసారిగా మంటలు తీవ్రంగా విస్తరించాయి. ఆ షాపులోనే ఉన్న నలుగురు చిన్నారులు సహా ఏడుగురు మంటలకు ఆహుతయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. అయితే మృతులంగా పెయింటింగ్ దుకాణానికి చెందిన వారేనని గుర్తించారు. వీరంతా షాపులోనే నివాసం ఉంటున్నట్టు తెలుస్తోంది. ఎంతో శ్రమించి ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

You might also like