FbTelugu

అయ్యో పాపం… ముద్దు ఇచ్చి కత్తిరించింది!

లండన్: గాఢమైన ముద్దు ఇచ్చి నాలుకను కొరికిపారేసిన ఘటన బ్రిటన్ లో జరిగింది. తనతో వాగ్వాదానికి దిగిన వ్యక్తి ని గట్టిగా చుంభించి ఆ తరువాత నాలుక అంచును కొరికేసింది. ఇంకేముంది ఆ ముక్కను గమనించకుండ కొట్లాడుకుంటుండగా ఒక పక్షి ఎగిరేసుకుని పోయింది.

స్కాట్లాండ్ లో 2019లో జరిగిన ఈ ఘటనలో మహిళకు కోర్టు జరిమానా విధించింది వదిలేసింది. ఎడిన్ బర్గ్ కు చెందిన బెథాని ర్యాన్ అనే మహిళకు జేమ్స్ మెకెంజీలు అనే వ్యక్తికి మధ్య చిన్న గొడవ చోటు చేసుకున్నది. మాటామాటా పెరగడంతో ఇద్దరూ రోడ్డుపై కీచులాడుకున్నారు. ఈ క్రమంలో మెకెంజీ పిడికిలి బిగించి ఆమె మీదకు దూసుకువెళ్లాడు. దెబ్బలు తినే బదులు ఆమె గాఢంగా ముద్దులు పెట్టి ఉక్కిరిబిక్కిరి చేసింది. అంతటితో ఆగకుండా ఆవేశంలో నాలుక చివరి భాగాన్ని కొరికిపారేసింది. నాలుక చివరి భాగం కిందపడిపోయినా కూడా ఇద్దరు గమనించలేదు. అయినా గొడవ పడుతునే ఉన్నారు.

ఈలోపు చెట్టుపై ఉన్న సిగుల్ పక్షి కి ఆ నాలుక ముక్క కంటపడడంతో ముక్కుతోనే కరుచుకుని ఎత్తికెళ్లింది. రక్తం కారడంతో నాలుక తెగిందని గమనించి బెథాని భయాందోళనకు గురయ్యాడు. స్థానికులు హాస్పిటల్ కు తరలించగా ఆపరేషన్ చేయాలని చెప్పగా, నాలుక భాగం లభ్యం కాలేదు. ఆపరేషన్ చేయడం కుదరదని ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపించారు. ఈ ఘనటపై బెథాని పోలిసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా రిజిష్టర్ చేశారు. గతవారం ఈ కేసును ఎడిన్ బర్గ్ కోర్టు విచారణ జరగ్గా, తను చేసిన తప్పిదానికి ఆమె క్షమాపణలు కోరడంతో జరిమానా విధించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.