FbTelugu

డబ్బుకోసం పోలీసుల అవతారం

కృష్ణా: అక్రమంగా డబ్బు సంపాధించడానికి కొందరు దుండగులు ఏకంగా పోలీసుల అవతారం ఎత్తారు. ఈ ఘటన జిల్లాలోని జగ్గయ్య పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివనాగేంద్ర, వీరాంజనేయులు, గోపాలకృష్ణ అనే నిందితులు.. అక్రమంగా డబ్బు సంపాధించేందుకు పోలీసుల అవతారమెత్తారు.

వచ్చిపోయే వాహనదారులను బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మద్యం స్మగ్లర్లను టార్గెట్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.