FbTelugu

సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ప్రారంభం

సిద్దిపేట: సిద్దిపేటలో సిఎం కెసిఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొండపాక మండలం దుద్దెడ శివారులో నిర్మాణం చేసిన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో అధునాతన సదుపాయాలతో కలెక్టర్ కార్యాలయాన్ని నిర్మించారు. అంతకు ముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తోపాటు సిద్దిపేట పోలీసు కమిషనరేట్ భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా ప్రజలు అందచేసిన వినతులను సిఎం కెసిఆర్ స్వీకరించారు. కొండపాక మండలం రాంపల్లి శివారులో పోలీసు కమిషనరేట్ భవనం నిర్మాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డిజిపి ఎం.మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.