FbTelugu

హైదరాబాద్ లో పివి విగ్రహాం ఆవిష్కరణ

హైదరాబాద్: తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పివి.నరసింహారావు కాంస్య విగ్రహాన్ని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవిష్కరించారు. నెక్లెస్ రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

పివి.నరసింహారావు శత జయంతి ఉత్సవాలను నెక్లెస్ రోడ్డులోని పివి మార్గ్ లో నిర్వహించారు. న్యూఢిల్లీలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పివి కి నివాళులు అర్పించారు. స్వావలంబన, స్వయం సమృద్ధికి పెద్దపీట వేశారని కొనియాడారు. విశాల దృష్టితో వీక్షించి దేశానికి వారు అందించిన సేవలను జాతి యావత్తు గుర్తు పెట్టుకుంటుందన్నారు. పివి.నరసింహారావు గొప్ప వ్యక్తి అని, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.