FbTelugu

గడిచిన 24 గంటల్లోనే 11,502 కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో గడిచిన 24 గంటల్లోనే 11,502 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. దీంతో దేశంలో ప్రస్తుతం మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 3,32,424 కు చేరింది. దీనికి సంబంధించి కేంద్ర వైద్య,

ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. కరోనాతో గడిచిన 24 గంటల్లో 325 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 9,520 కి చేరింది. కాగా దేశంలో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 1,53,106 గా ఉంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,69,798 కి చేరింది.

You might also like