FbTelugu

భారత్ లో గడిచిన 24 గంటల్లోనే 9,985 కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా రోజురోజుకి తీవ్రంగా వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా నేటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 76 వేల 583 కు చేరింది. నేటికి దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,745 కు చేరింది.

గడిచిన 24 గంటల్లోనే దేశంలో 9,985 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 279 కరోనా మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 1లక్షా 33 వేల 632 గా ఉంది. కాగా కరోనా బారి నుంచి 1లక్షా 35 వేల 205 మంది డిశ్చార్జ్ అయినారు.

You might also like